భారతదేశం, డిసెంబర్ 26 -- అనసూయపై బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విరుచుకుపడింది. శివాజీ వివాదాస్పద కామెంట్లపై రియాక్టయిన మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. శివాజీ మాట్లాడిన విధానం, ఉపయోగించిన పదాలు తప్పు కానీ ఆయన ఉద్దేశం తప్పు కాదని మాధురి చెప్పింది. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

శివాజీ కామెంట్లు వైరల్ గా మారాయి. హీరోయిన్ల డ్రెస్ తీరుపై శివాజీ ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ 'సామాన్లు', 'దొంగము**' అనే పదాలు వాడాడు. దీనిపై అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు ఫైర్ అయ్యారు. వీటిపై ఓ టీవీ డిబేట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రియాక్టయ్యారు.

''శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ కొన్ని మాటలు తప్పుగా మాట్లాడారు. ఇప్పటికే సారీ కూడా చెప్పారు కాబట్టి క్లియర్. కొంతమంది హీరోయిన్లు అసభ్యకరంగానే బట్టలు వేసుకుంటున్నారు. స...