భారతదేశం, జూలై 25 -- ముంబై: నిన్న (గురువారం) బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నేడు (శుక్రవారం) ఉదయం భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ఈ షేర్ ధర ఒక్కసారిగా 900 రూపాయలకు పడిపోయింది. గురువారం ముగింపు ధర 958.95 రూపాయలతో పోలిస్తే, నేడు ఒక్కసారిగా 5 శాతానికి పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

బజాజ్ ఫైనాన్స్ Q1 2025 ఫలితాలపై ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "బజాజ్ ఫైనాన్స్ ఆర్థికంగా అద్భుతమైన పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 22 శాతం ప...