భారతదేశం, నవంబర్ 4 -- భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (NBFC), బజాజ్ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్‌లో వినియోగ ఫైనాన్స్‌లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, కంపెనీ పంపిణీ చేసిన వినియోగదారుల రుణాల సంఖ్య (వాల్యూమ్) 27% పెరిగింది. రుణాల విలువ కూడా 29% అధికంగా ఉందని కంపెనీ ఈరోజు ప్రకటించింది.

ఈ వినియోగ క్రెడిట్ వృద్ధికి ప్రధాన కారణం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు,వ్యక్తిగత ఆదాయ పన్నులో చేసిన మార్పులే అని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది.

బజాజ్ ఫైనాన్స్ సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 26, 2025 మధ్య సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేసింది. ఈ సమయంలో, కంపెనీ 23 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. వీరిలో ఏకంగా ...