భారతదేశం, జూలై 24 -- నిన్న భారత స్టాక్ మార్కెట్ కాస్త లాభాలతో ముగిసింది. నిన్నటి త్రైమాసిక ఫలితాల కారణంగా ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ వంటి ప్రధాన స్టాక్‌లు ఈరోజు మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్శిస్తాయి. బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎనర్జీ, కెనరా బ్యాంక్, మోతీలాల్, IEX (INox) స్టాక్‌లు కూడా దృష్టిని ఆకర్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి జూన్ త్రైమాసిక ఫలితాలను నేడు మార్కెట్లో విడుదల చేస్తాయి.

టాటా కన్స్యూమర్స్ జూలై 23న తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనిలో 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 15 శాతం పెరిగి రూ.334 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ.290 కోట్లు. ఈరోజు టాటా కన్స్యూమర్స్ స్టాక్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫోసిస్ భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస...