భారతదేశం, జనవరి 16 -- భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సందడి పెరుగుతోంది. తాజాగా స్వదేశీ దిగ్గజం బజాజ్ ఆటో తన పాపులర్ చేతక్ సిరీస్‌లో సీ25 ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది. దీనినే సీ2501 అని కూడా పిలుస్తున్నారు. బజాజ్ నుంచి వస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. అయితే, మార్కెట్​లో ఇప్పటికే దూసుకెళుతున్న ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి సంస్థల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ పోటీలో బజాజ్ చేతక్ ఎంతవరకు నిలబడుతుంది? వివిధ ఈ-స్కూటర్లతో దీనిని పోల్చి చూద్దాము..

బ్యాటరీ, రేంజ్: బజాజ్ చేతక్ సీ2501లో 2.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. కేవలం 2 గంటల 25 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

ఓలా ఎస్​1 ఎక్స...