భారతదేశం, డిసెంబర్ 15 -- కరోనా రెమిడీస్ ఐపీఓకి దేశీయ స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్​ లభించింది! కరోనా రెమిడీస్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ. 1,461 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అప్పర్​ బ్యాండ్​ అయిన రూ. 1,062 కన్నా 37.57% ఎక్కువ. అదే సమయంలో బీఎస్ఈలో ఈ ఐపీఓ రూ. 1,452 వద్ద లిస్ట్ అయింది. ఇది 36.72% ప్రీమియం.

లిస్టింగ్​ తర్వాత కూడా కరోనా రెమిడీస్​ స్టాక్​ దూసుకెళుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఉదయం 10:15 గంటల సమయానికి రూ. 1497.70 వద్ద ఇంట్రాడే- హైని నమోదు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ. 1468 వద్ద ట్రేడ్​ అవుతోంది.

గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అంచనాలను మించి కరోనా రెమిడీస్ ఐపీఓ అద్భుతమైన ప్రదర్శన చేయడం గమనార్హం! ఈ ఐపీఓ జీఎంపీ షేరుకు రూ. 342.50 వద్ద ఉంది. ఇది దాదాపు రూ. 1,404.50 (32.25శాతం ప్రీమియం) వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉ...