Telangana,hyderabad,karimnagar, జూలై 19 -- ఒకరు కేంద్రమంత్రి.. మరొకరు ఎంపీ.! ఇద్దరూ ఒకే పార్టీ, అంతేకాదు ఒకే ఉమ్మడి జిల్లాకు చెందినవారు కూడా..! కాకపోతే కేంద్రమంత్రి.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. మరో నేత మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య వర్గపోరు నడుస్తుండగా. తాజాగా విషయం పీక్స్ కు చేరింది. దీంతో ఇద్దరు నేతలు కూడా. పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్ కు దిగారు. దీంతో కరీంనగర్ కమలదళంలో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు అయింది.

తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు నడుస్తోంది. నిజానికి ఈటల రాజకీయమంతా అంతా కూడా హుజురాబాద్ నుంచే ముడిపడి ఉంది. కాకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో. ఆయనకు మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి...