భారతదేశం, జూన్ 18 -- ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు 'రాజాసాబ్'. అవును.. ప్రభాస్ నటించిన ఈ లేటెస్ట్ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ టీజర్ లోనూ విజువల్ ఎఫెక్ట్స్, ఒకప్పటిలా డార్లింగ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ రాజాసాబ్ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ క్రేజీగా వాడుకుంది.

రొమాంటిక్ హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కింది రాజాసాబ్. ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ టీజర్ విడుదల చేశారు. తెలుగులో అయితే రెస్పాన్స్ అదిరిపోయేలా వస్తుంది. ముఖ్యంగా ఇందులోని క్యాచీ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. 'బండి కొంచెం మెల్లగా', 'అసలే మన లైఫ్ అంతంతమాత్రం' లాంటి డైలాగ్ లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ ...