భారతదేశం, డిసెంబర్ 26 -- బంగ్లాదేశ్ రాజకీయాల్లో గురువారం ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, BNP అగ్రనేత తారిఖ్ రెహమాన్ ఏకంగా 17 ఏళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టారు. మాతృదేశంపై మమకారంతో విమానాశ్రయం వెలుపల తన పాదరక్షలు విడిచి, మట్టిని చేతుల్లోకి తీసుకుని ఆయన ఉద్వేగానికి లోనైన తీరు అక్కడి జనాలను కదిలించింది.

వచ్చే 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢాకా చేరుకున్న వెంటనే పూర్బాచల్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయన చేసిన ఐక్యతా పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.

"మన దేశం కోసం నా దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రజలు ఎంతో కాలంగా...