భారతదేశం, జనవరి 3 -- బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యలు సంచలనంగా మారాయి. ఈ హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్ ను తమ జట్టు నుంచి కేకేఆర్ తప్పించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటు పడింది. తమ జట్టు నుండి విడుదల చేయాలనే ఆదేశాలు వచ్చిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం (జనవరి 3) స్పందించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ దేవాజిత్ సైకియా పీటీఐతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు హత్యకు గురైన కారణంగా ముస్తాఫిజుర్ ను వదులుకోవాలని కేకేఆర్ చెప్పినట్లు తెలిపాడు.

ఇటీవల ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర...