భారతదేశం, నవంబర్ 21 -- బంగ్లాదేశ్​లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. అక్కడి నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోల్​కతా, దాని పరిసర జిల్లాలు సహా ఈశాన్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.

యూరోపియన్​- మెడిటరేనియన్​ సిస్మోలాజికల్​ సెంటర్​ ప్రకారం.. ఈ భూకంపం తొలుత బంగ్లాదేశ్​లో సంభవించింది. నార్సింగ్దిలోని మధాబ్ది ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. భూమికి 10 కి.మీల లోతున భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టార్​ స్కేల్​పై 5.2గా నమోదైందని తెలుస్తోంది.

భూకంపం కారణంగా బంగ్లాదేశ్​- ఐర్లాండ్​ మధ్య క్రికెట్​ మ్యాచ్​కి అంతరాయం ఏర్పడింది. భూమి కంపించిన వెంటనే క్రికెటర్లు డ్రెస్సింగ్​ రూమ్​లో నుంచి మైదానం వైపు పరుగులు తీశారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆట మొదలైంది.

మరోవైపు భూ ప్రకంపనల ధాటికి కోల్​కతావాసులు హడలెత్తిపోయార...