భారతదేశం, మే 21 -- ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఉరుములతో కూడిన భారీ వర్షాలతో కోస్తా జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయం,సమాచారం కోసంవిపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా 1070, 112,...