భారతదేశం, జనవరి 10 -- నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

తాజాగా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్ర...