Andhrapradesh, సెప్టెంబర్ 3 -- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..ఇవాళ (సెప్టెంబర్ 03) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించింది.

మ...