Telangana, మే 28 -- పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఇవాళ(మే 28) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లలాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్ల భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.

రేపు(మ...