భారతదేశం, జనవరి 8 -- చాలా మంది ఈ చేతికి ఉంగరాలను ధరిస్తారు. ఖరీదైన బంగారు ఉంగరాలను కూడా చాలా మంది ధరిస్తారు. బంగారం విలువైన లోహం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఎంతో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. బంగారు ఉంగరాన్ని ధరించడం వలన ధనం, అదృష్టం, విజయాలు కలుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ లోహమైనా, రత్నమైనా సరైన విధంగా ధరిస్తే చక్కటి ఫలితాలను పొందడానికి వీలవుతుంది. తప్పుగా ధరిస్తే మాత్రం ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బంగారం ఉంగరాన్ని ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? బంగారం ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే బంగారానికి గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. బంగారాన్ని ధరించడం వలన జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. గురు గ్రహం బలపడడం వలన ధనం, శుభం...