భారతదేశం, జనవరి 9 -- స్టాక్ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఎప్పుడూ సురక్షితమైన దారి కోసం వెతుకుతారు. అందుకే ఇప్పుడు భారతీయ మదుపర్లందరూ 'బంగారం' బాట పట్టారు. డిసెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)లలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం.

గత కొంతకాలంగా గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో తమ పెట్టుబడులకు రక్షణ కవచంలా ఉంటుందని భావిస్తూ ఇన్వెస్టర్లు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs)లో భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్ లు ఏకంగా Rs.11,646.74 కోట్ల నికర పెట్టుబడులను ఆకర్షించాయి. సాధారణంగా ఇన్వెస్టర్లు ఎక్కు...