భారతదేశం, డిసెంబర్ 31 -- బంగారం అంటే భారతీయులకు కేవలం లోహం కాదు, అదొక సెంటిమెంట్. పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా అడపా దడపా బంగారం కొనడం మనకు ఆచారంగా వస్తోంది. అయితే, ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు సామాన్యుడి సెంటిమెంట్‌ను, కొనుగోలు అలవాట్లను మార్చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రతి పండుగకు ఏదో ఒక నగ కొనే అలవాటున్న ముంబై గృహిణి ప్రాచీ కదమ్, ఈసారి మాత్రం నెక్లెస్‌కు బదులు 10 గ్రాముల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు.

"నాకు నగలు అంటే ఇష్టం, ఫంక్షన్లలో వేసుకోవచ్చు. కానీ, ఆభరణాల ధరపై అదనంగా 15 శాతం వరకు మజూరీ (Making Charges) కట్టడం ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తోంది. అందుకే ఈసారి నగలకు బదులు నాణేన్ని కొనుగోలు చేయడమే ఉత్తమమనిపించింది" అని ప్రాచీ కదమ్ తన నిర్ణయాన్ని వివరించారు. ఈమె ఒక్కరే కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది...