భారతదేశం, జనవరి 23 -- బంగారం, వెండి ధరలు తగ్గడం మాటేమో కానీ, రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్సు‌కు 4,969.69 డాలర్ల వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా 2.50 శాతం లాభంతో ఔన్సు‌కు 98.980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది.

పసిడి ధరలు ఇక్కడితో ఆగుతాయని ఎవరూ భావించడం లేదు. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేసిన దానికంటే వేగంగా ధరలు పెరుగుతున్నాయి. 2026 చివరి నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే బంగారం అందుకుంది.

ప్రముఖ రచయిత రోబర్ట్ కియోసాకి అయితే వెండి ధర 2026లో 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా వెండిని కొనుగోలు చేయడం (Bottom fishing) మంచి అవకాశమని...