భారతదేశం, జూలై 5 -- ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ అంటే ఉండే ప్రెషర్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటారు. ప్రతి ఇన్నింగ్స్ ను గమనిస్తారు. అపోనెంట్ టీమ్స్ స్పెషల్ ప్లాన్స్ వేసుకుంటాయి. అలాంటి ప్రెషర్ లోనూ అదరగొట్టే విరాట్ కోహ్లి లాంటి కెప్టెన్ ను చూశాం. ఇప్పుడు యంగ్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఆ ఘన వారసత్వాన్ని అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.

భారత టెస్టు కెప్టెన్ గా శుభ్‌మ‌న్ గిల్ కు ఇంగ్లాండ్ తో సిరీస్ మొదటిది. ఈ సిరీస్ తోనే సారథిగా శుభ్‌మ‌న్ జర్నీ స్టార్ట్ అయింది. పైగా ఈ సిరీస్ కు ముందు విదేశాల్లో గిల్ టెస్టు ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. దీంతో గిల్ ఇంగ్లాండ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సెంచరీల ...