భారతదేశం, సెప్టెంబర్ 23 -- భారతదేశంలో పండుగ షాపింగ్ సీజన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కస్టమర్స్​కి క్రేజీ డిస్కౌంట్స్​ని ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సేల్స్​లో పలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ప్రీమియం హ్యాండ్‌సెట్‌లలో ఐఫోన్ 16కు అత్యధిక డిమాండ్ ఉన్న తరుణంలో ఈ మోడల్​పై మంచి ఆఫర్స్​ లభిస్తున్నాయి. ఈ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు ఐఫోన్‌ను తమ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలబెట్టాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఐఫోన్ 16 ధరలు ఎలా ఉన్నాయో, ఏ ఏ ఆఫర్లు లభిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాము..

భారతదేశంలో ఐఫోన్ 16 (128 జీబీ వేరియంట్) సెప్టెంబర్ 2024లో రూ. 79,900 ప్రారంభ ధరతో విడుదలైంది. శక్తివంతమైన ఏ18 బయోనిక్ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రీ...