Hyderabad, జూన్ 25 -- నెట్‌ఫ్లిక్స్ లోకి ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. మాధవన్, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం (జూన్ 25) రిలీజైంది. ఈ మూవీ పేరు ఆప్ జైసా కోయి (Aap Jaisa Koi). సరదాగా సాగిపోయిన ఈ ట్రైలర్లో మాధవన్ ఓ సంస్కృతం టీచర్ గా నటించడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గతంలోనే ఆప్ జైసా కోయి మూవీని అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఓ సంస్కృతం టీచర్ గా పని చేసే శ్రీరేను (మాధవన్) అనే 39 ఏళ్ల వ్యక్తి.. పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు. ఓ మధ్యవర్తి ద్వారా 32 ఏళ్ల మధు అనే మరో టీచర్ ను అతడు కలుసుకుంటాడు.

అయితే సాంప్రదాయ కుటుంబానికి చెందిన శ్రీరేను, మోడర్న్ అమ్మాయి అయిన మధుకి అంత సులువుగా లింకు కలవదు. ఆమెతోపాటు ఆమె కుటుంబం కూడా చాలా ఆధునికం...