భారతదేశం, జూన్ 7 -- ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరో తేలిపోయింది. రసవత్తరంగా సాగిన ఈ టోర్నీలో అంచనాలను దాటి కోకో గాఫ్ టైటిల్ పట్టుకుపోయింది. శనివారం (జూన్ 7) హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో కోకో గాఫ్ 6-7 (5), 6-2, 6-4 తేడాతో టాప్ సీడ్ అరీనా సబాలెంకాకు షాకిచ్చింది. తొలి సెట్ ఓడిపోయిన తర్వాత కూడా అద్భుతంగా పుంజుకున్న 21 ఏళ్ల గాఫ్.. వరుసగా తర్వాతి రెండు సెట్లు గెలిచి ఫస్ట్ టైమ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకుంది.

ప్రపంచ నంబర్ వన్ సబాలెంకా (బెలారస్), నంబర్ టూ కోకో గాఫ్ (అమెరికా) మధ్య ఫ్రెంచ్ ఓపెన్ 2025 వుమెన్స్ సింగిల్స్ టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. 78 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్లో గాఫ్ ఓడిపోయింది. డబుల్ బ్రేక్ తో 4-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సబాలెంకా త్వరలోనే తన అడ్వాంటేజ్ కోల్పోయింది. గాఫ్ గొప్పగా పుంజుక...