భారతదేశం, డిసెంబర్ 16 -- భద్రాచలం ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మెుక్కలు నాటి.. అనంతరం బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడిన నాగిరెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రోజూ 10 వేల బస్సుల్లో 60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇందులో సుమారు 45 లక్షల మంది మహిళలు ఉన్నట్టుగా తెలిపారు.

'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రాబడి పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 కోట్లకుపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఫ్రీ బస్సుతో మహిళలకు రూ.8500 కోట్ల వరకు ఆదా అయింది. రెండు సంవత్సరాలలో 2500 కొత్త బస్సులను కొనుగోలు చేశాం. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 800కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడు సంవత్సరాలలో హైదరాబాద్‌లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస...