భారతదేశం, ఏప్రిల్ 27 -- చిత వై-ఫై ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు. ముఖ్యంగా విమానాశ్రయం, కాఫీ షాప్ లేదా బహిరంగ ప్రదేశంలో అందుబాటులో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఇది సులభమైన మార్గం. పబ్లిక్ వై-ఫై ఉపయోగించడం వల్ల మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుంది. ప్రజలు తమ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి ఆర్థిక లావాదేవీలు వంటి సున్నితమైన ప్రయోజనాల కోసం ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగించవద్దని ప్రభుత్వం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది.

పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు సరైన భద్రత ఉండదు. ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయి. డిజిటల్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) 'అవేర్నెస్ డే' కార్యక్రమం కింద కొత్త రిమైండర్‌ను విడుదల చేసింది.

పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ షాపి...