భారతదేశం, డిసెంబర్ 25 -- మారుతీ సుజుకీకి చెందిన ప్రముఖ మోడల్ 'ఫ్రాంక్స్‌' భద్రతపై ఇప్పుడు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఏఎన్‌సీఏపీ (ఆస్ట్రేలేషియన్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) క్రాష్ టెస్టుల్లో ఈ కారు దారుణంగా విఫలమైంది. భద్రతా ప్రమాణాల్లో వెనుకపిడిపోవడమే కాకుండా, సీటు బెల్టులు ఊడిపోవడం (ఇది చాలా అరుదుగా జరిగే ప్రమాదం) వంటి లోపాలు భయపెట్టే విధంగా ఉన్నాయి. ఫలితంగా క్రాష్​ టెస్ట్​లో ఈ కారు 1 స్టార్​ రేటింగ్​ని మాత్రం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌లో ఫ్రాంక్స్‌ కార్ల విక్రయాలను కంపెనీ తక్షణమే నిలిపివేసింది.

సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను కాపాడాల్సిన సీటు బెల్టులే ఇక్కడ విఫలమయ్యాయి. క్రాష్ టెస్ట్ నిర్వహించిన సమయంలో వెనుక సీటు బెల్టు మెకానిజం సరిగ్గా పనిచేయలేదు. దీనివల్ల ప్రయాణికులు స...