భారతదేశం, డిసెంబర్ 17 -- ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులను జారీ చేయడం ప్రారంభించింది. ఇది నగర శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఒక ప్రధాన అడుగుగా చెప్పవచ్చు. అథారిటీ పూర్తిగా పనిచేయడంతో, నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మిర్ఖాన్‌పేటలో ఎఫ్‌సీడీఏ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు దాదాపు 40 శాతం పూర్తయ్యాయి. బేస్‌మెంట్, పిల్లర్ పనులు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించిన ఫిబ్రవరి 2026 గడువు నాటికి భవనం సిద్ధంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. FCDA అధికార పరిధిలోని సర్వే నంబర్ 112లోని 7.5 ఎకరాల్లో శాశ్వత కార్యాలయం రానుంది. భవనం పూర్తయ్యే వరకు నానక్‌రామ్‌గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) ప్రాంగణంలో తాత్కాలిక కార్యాల...