Telangana,hyderabad, జూన్ 29 -- భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని. ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు.

పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశాలపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిన పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు కావలసిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలన్నారు. అందుకు రైతులతో సంప్రదించి ఒప్పించాలని చె...