భారతదేశం, డిసెంబర్ 9 -- బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు అయ్యారు. బలమైన క్రీడా వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు్న్నారన్నారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు కావడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పారు. స్పోర్ట్స్ విషయంలో తన వంతుగా సాయం ఉంటుందన్నారు. అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్ వంటి ఇతర క్రీడా దిగ్గజాలతో కలిసి సింధు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్ద ఇందిరమ్మ చీరలో కనిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇందిరమ్మ చీరలను అందిస్తోంది. నవంబర్ 19న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు దశల్లో మహిళలకు కోటి చీరలను ...