భారతదేశం, ఏప్రిల్ 29 -- ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ రావాల్సి ఉంది. ఇంతలోనే మూడో సీజన్‍లో ఓ కీలక పాత్రలో పోషిస్తున్న నటుడు రోహిత్ బస్ఫర్ (27) మరణించారు. అసోంలోని గర్భంగ వాటర్ ఫాల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం రోహిత్ మృతదేహం కనిపించింది. స్నేహితులతో పిక్నిక్‍కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

గువహటిలోని గర్భంగ వాటర్ ఫాల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రోహిత్ బస్ఫర్ ప్రమాదవశాత్తు జారిపడిపోయారని అక్కడి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. తమకు ఈ విషయం తెలిశాక సాయంత్రం 4.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరామని, సాయంత్రం 6.30 గంటల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ టీమ్ మృతదేహాన్ని బయటికి తీసిందని రాణి పోలీస్ ఔట్‍పోస్ట్ అధికారులు చెప్పారు.

రోహిత్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మృతదేహ...