భారతదేశం, జనవరి 7 -- మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత ఓ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌లా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో అతడు అలరించనున్న విషయం తెలిసిందే. మూవీ జనవరి 13న రిలీజ్ కానుండగా.. బుధవారం (జనవరి 7) ట్రైలర్ రిలీజ్ చేశారు.

రవితేజ తన మాస్ మహారాజా పేరుకు తగినట్లే కొన్నాళ్లుగా వరుసగా మాస్ సినిమాలతో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాడు. దీంతో ఈసారి రూటు మార్చి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ కు తగినట్లుగానే.. ట్రైలర్ కూడా ఫన్నీగా సాగిపోయింది.

బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైట్లు, జాతర ఫైట్లు చేశానని, ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడంటూ ఈ ట్రైలర్ మొదలు పెడతాడు రవితేజ. ఆ తర్వాత అతడు ఫ్యామిలీ మ్యాన్ రూపంల...