భారతదేశం, జూలై 18 -- దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారు కోసం నిరీక్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మారుతీ ఈ విటారాపై తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మోడల్​ సెప్టెంబర్​ 3న మార్కెట్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

దేశంలో విపరీతమైన డిమాండ్​ కనిపిస్తున్న ఈవీ సెగ్మెంట్​లో మారుతీ సుజుకీకి ఇప్పటివరకు ఒక్క వెహికిల్​ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రానున్న ఈ విటారాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి ప్రత్యర్థులతో గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.

మేడ్-ఇన్-ఇండియా సుజుకి ఈ-విటారా ఇప్పటికే యూకే మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ...