భారతదేశం, మే 11 -- కియా మోటార్స్​ ఇండియాలోకి సరికొత్త క్యారెన్స్ క్లావిస్​ ఎంపీవీని తీసుకొచ్చింది. ఇది సుపరిచితమైన కారెన్స్ ఎంపీవీకి మరింత ప్రీమియం వర్షెన్​ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మోడల్స్​ ఫ్యామిలీలకు బాగా సూట్​ అవుతాయి. కాగా క్లావిస్ అదనపు లగ్జరీ, అధునాతన సాంకేతికతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి, అసలు వీటి మధ్య ఉన్న తేడాలేంటి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

విజువల్​గా చూసుకుంటే, క్యారెన్స్ క్లావిస్ బోల్డ్​గా, ట్రెడిషనల్​కి విరుద్ధంగా ఉంటుంది. కియా యొక్క "అపొజిట్స్​ యునైటెడ్" డిజైన్ ఫిలాసఫీ నుంచి తీసిన క్లావిస్ మరింత నిటారుగా ఉండే స్టైలింగ్, లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేసిన ఎల్-ఆకారంలో ఉన్న ఎల్​ఈడీ డిఆర్ఎల్స్​, కియా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాలను గుర్తుచేసే విలక్షణమైన 'ఐస్ క్యూబ్' హెడ్ ల్యాంప్లను ...