భారతదేశం, సెప్టెంబర్ 8 -- హాస్టల్ రాగానే హోమ్ సిక్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలనే బెంగ ఉంటుంది. విద్యార్థుల ఇంటి బెంగను తొలగించి మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 110 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో పేఫోన్‌లను ఏర్పాటు చేస్తోంది. దీనితో విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలలో లభించే సౌకర్యాల మాదిరిగానే ప్రతిరోజూ తల్లిదండ్రులు, బంధువులతో కనెక్ట్ అవ్వొచ్చు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 40,000 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారు. వారి కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల తరచుగా హోమ్ సిక్, ఒంటరితనంగా ఉన్నట్టుగా ఫీలవుతారు. రోజువారీ ఫ్యామిలీతో మాట్లాడడం ద్వారా విద్యార్థులు ఇంటి బెంగను తగ్గించుకుని రి చదువులపై బాగా దృష్టి పెడతారని ప్రభుత్వం భావిస్త...