భారతదేశం, జనవరి 23 -- స్టార్ మాలో వచ్చే సీరియల్స్ కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. టాప్ సీరియల్ కార్తీక దీపం 2 నుంచి గుండె నిండా గుడి గంటల వరకు ఈ ధారవాహికలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ ఈ సీరియల్స్ స్టార్లందరూ కలిసి ఒకే చోట కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. వచ్చే ఆదివారం అదే జరగబోతుంది. పొదరిల్లు సీరియల్ జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన కు వీళ్లందరూ రాబోతున్నారు.

టెలివిజన్ సీరియల్ చరిత్రలో బహుశా మొదటి సారి అనుకుంటా ఓ సీరియల్ లోని వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇతర సీరియల్ స్టార్లందరూ రాబోతున్నారు. హైదరాబాద్లో కనీవిని ఎరుగని టెలివిజన్ మహోత్సవం జనవరి 25 ఆదివారం నాడు జరగబోతుంది. స్టార్ మా సీరియల్ అయిన 'పొదరిల్లు' జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్, అనుటెక్స్ చౌరస్తా, మల్కాజిగి...