భారతదేశం, మే 6 -- స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హాట్ బ్యూటీ అవనీత్ కౌర్ మధ్యలోకి వెళ్లిన సింగర్ రాహుల్ వైద్య కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ లో అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది పొరపాటున జరిగిందని కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనిపై కోహ్లీ ట్రోల్ చేసేలా రాహుల్ స్పందించాడు. ఇప్పుడు కోహ్లి ఫ్యాన్స్ ను జోకర్స్ అని పిలిచాడు.

బాలీవుడ్ బోల్డ్ భామ అవనీత్‌ కౌర్ ఫ్యాన్ పేజీలో కోహ్లి అఫీషియల్ అకౌంట్ నుంచి లైక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రకరకాల ఊహగానాలు వచ్చాయి. అయితే ఇది అల్గారిథం పొరపాటు కారణంగా జరిగి ఉండొచ్చని, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కోహ్లి వివరణ ఇచ్చాడు. అయితే దీనిపై రాహుల్ వైద్య వెటకారంగా మాట్లాడాడు. కోహ్లీని ట్రోల్ చేసేలా పోస్టు పెట్టాడు....