భారతదేశం, డిసెంబర్ 28 -- తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినీ కెరీర్ కు ఎండ్ కార్డు పడబోతుంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ నటుడు తన చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) అని చెప్పేశాడు. శనివారం (డిసెంబర్ 27) మలేషియాలో జన నాయకుడు ఆడియో లాంఛ్ ఈవెంట్ జరిగింది. మలేషియా నుంచి రిటర్న్ అవుతూ ఫ్యాన్స్ పై ప్రేమ కురిపించాడు విజయ్.

'జన నాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్ కోసం మలేషియాకు వెళ్లిన దళపతి విజయ్ ఆదివారం చెన్నైకి బయలుదేరాడు. ప్రయాణానికి ముందు అతను అక్కడికి తన కోసం వచ్చిన ఫ్యాన్స్ పై ప్రేమ కురిపించాడు. అభిమానులతో విజయ్ సంభాషించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వెలువడ్డాయి.

మలేషియా నుండి బయలుదేరే ముందు విజయ్ అభిమానులను పలకరించాడు. ఒక క్లిప్ లో విజయ్ గేట్ దగ్గరకు వచ్చి, అక్కడ గుమిగూడిన ప్రేక్షకులను చూసి చిరునవ్వు నవ్వాడు. వార...