భారతదేశం, మే 19 -- అప్పుడెప్పుడో రష్మిక మంధాన హీరోయిన్ గా తన డైరెక్షన్ లో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అనౌన్స్ చేశాడు రాహుల్ రవీంద్రన్. అయిదు నెలల క్రితమే టీజర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ తర్వాత మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఏ చప్పుడు లేదు. దీని గురించే ఫ్యాన్స్ ప్రశ్నిస్తే తాజాగా రష్మిక మంధాన రియాక్టయింది. మూవీ ఆలస్యంపై ఆన్సర్ ఇచ్చింది.

రష్మిక మంధాన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో రీసెంట్ గా ఎక్స్ లో"#ReleaseTheGirlfriend" ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీపై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రష్మిక మంధాన రియాక్టయ్యారు. ఎక్స్ లో రాహుల్ రవీంద్రన్ పోస్టును షేర్ చేస్తూ రష్మిక ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసింది. ''త్వరలోనే అప్ డేట్ వస్తుంది. ప్రామిస్. కాస్త ఓపికతో ఉండండి'' అని రవీంద్రన్ పోస్టు చేశా...