భారతదేశం, జూన్ 23 -- బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చెల్లెలు సునయన రోషన్ తన ఫ్యాటీ లివర్ సమస్య గురించి, ఇతర అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడూ దాచుకోకుండా మాట్లాడతారు. 2007లో ఆమెకు చాలా అరుదైన గర్భాశయ, లింఫోమా క్యాన్సర్లు ఉన్నాయని కూడా తేలింది. తాజాగా, సెలబ్రిటీ డైటీషియన్ ర్యాన్ ఫెర్నాండోతో ఓ ఇంటర్వ్యూలో సునయన తన ఫ్యాటీ లివర్‌ను ఎలా తగ్గించుకుందో, తన లివర్‌కు ఏదో తేడా ఉందని ఆమెకు మొదటగా ఎలా తెలిసిందో చెప్పారు.

తన ఒంట్లో ఏదో తేడా ఉందని మొదట ఎలా గుర్తించారు అని అడిగినప్పుడు, సునయన తనకు పచ్చకామెర్లు వచ్చాయని చెప్పారు. "పచ్చకామెర్లు రాకముందే ఓ వారం రోజుల ముందు నా సోడియం లెవెల్స్ పడిపోయాయి. నాకు సెలైన్ పెట్టారు" అని ఆమె అన్నారు. ఫ్యాటీ లివర్ అని తెలిసినప్పుడు, ఆరోగ్యం పట్ల తాను చాలా నిర్లక్ష్యంగా ఉన్నానని, నచ్చినట్లు చేశానని సునయిన ఒప్పుకున్నారు. ...