భారతదేశం, జూన్ 27 -- మన శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ చేయడానికి, అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మందికి 'ఫ్యాటీ లివర్' సమస్య వస్తోంది.

జాతీయ ఆరోగ్య సంస్థ (NIH) ప్రకారం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మందిలో కనిపిస్తోంది. ఈ సంఖ్య పెరుగుతోందని కూడా వారు చెబుతున్నారు. అంటే, ఈ సమస్యపై అవగాహన పెంచడం, ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి జూన్ 26న పోస్ట్ చేసిన ఒక వీడియోలో 10 సాధారణ ఆహార పదార్థాలను వాటి 'ఫ్...