భారతదేశం, సెప్టెంబర్ 3 -- డిజిటల్ ఆడియన్స్ కు మరోసారి థ్రిల్ పంచేందుకు సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ 'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్' కొత్త సీజన్ తో వచ్చేస్తోంది. ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అయిదో సీజన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఇందులో హాలీవుడ్ హాట్ బ్యూటీ సెలీనా గోమెజ్ కూడా కీలక పాత్ర పోషించింది.

మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ 'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్' అయిదో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సారి ఇందులో అదిరిపోయే ట్విస్ట్ లు ఉండబోతున్నాయి. ఈ సూపర్ హిట్ మర్టర్ మిస్టరీ కామెడీ సిరీస్ అయిదో సీజన్ జియోహాట్‌స్టార్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇండియన్ ఆడియన్స్ కూడా దీన్ని వీక్షించొచ్చు.

'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్' వెబ్ సిరీస్ అయిదో సీజన్ లో సెప్టెంబర్ 3న ఫస్ట్ మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతాయి....