భారతదేశం, జూలై 14 -- సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి దీపికా పదుకొణె 8 గంటల షిఫ్ట్ డిమాండ్ కారణంగా తప్పుకోవడంతో సినీ పరిశ్రమలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ చర్చపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సరసన స్పిరిట్ అనే యాక్షన్ చిత్రంలో నటించడానికి దీపిక చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె 8 గంటల పని, సినిమా లాభాలలో వాటా, డైలాగులు తెలుగులో చెప్పనని డిమాండ్ చేసిందని తెలిసింది.

హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఈ వివాదం గురించి, ఫిక్స్ డ్ షిఫ్ట్ అవర్స్ డిమాండ్ గురించి మాట్లాడారు. ''నటీనటులకు షిఫ్ట్ టైమింగ్స్ ఫిక్స్ చేసేటప్పుడు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ...