భారతదేశం, జనవరి 7 -- తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని సమన్లు ​​జారీ చేసింది. జనవరి 8, గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరు కావాలని తెలిపింది.

బీఆర్ఎస్ పాలనలో ఫోన్లు ట్యాప్ చేసిన వ్యక్తులలో కొండల్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. అప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఆయనను పిలిచి సిట్ విచారణ చేయనుంది. కొండల్‌రెడ్డితోపాటుగా మరికొందరికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఇద్దరు నాయకులకు కూడా సిట్ విచారణకు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య గురువారం హాజరు కావాలని ఆదేశించారు అధికారులు. ఇద్దరు బీఆర్ఎస్ నా...