భారతదేశం, జనవరి 28 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంతోష్‌ను కేసుకు సంబంధించిన అనేక అంశాలపై దర్యాప్తు అధికారులు పరిశీలించారు. దాదాపు రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే సంతోష్ రావు సిట్ ముందు హాజరుకావడం రాజకీయ చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు.. బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) సీనియర్ అధికారుల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారా? అని సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది.

మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఆయన సంభాషణ...