భారతదేశం, డిసెంబర్ 26 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు లొంగిపోయారు. 14 రోజుల కస్టోడియల్ విచారణ గడువు ముగియటంతో. ఇవాళ ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత. ఇంటికి పంపించారు.

ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ టీమ్ పని చేస్తోంది. ప్రభాకర్ రావును ఈ ప్రత్యేక బృందం పలుమార్లు విచారించింది. జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లోని కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ కొనసాగింది. సిట్‌ సభ్యులు అంబర్‌కిశోర్‌ ఝా, విజయ్‌కుమార్‌ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ జరిపారు. ఇదే కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడత విచారించారు. ...