భారతదేశం, జనవరి 23 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా. దాదాపు 7 గంటలకుపైగా విచారణ కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు కేటీఆర్ సిట్ విచారణ జరుగుతున్నంత సేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు. ఓవైపు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ.. పార్టీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ పరిసరాల్లోనే ఉన్నారు.

ఇక సిట్ విచారణపై పలు మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. "సిట్ విచారణలో భాగంగా ఇలా జరుగుతోంది, అలా జరుగుతోంది అని కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిళ్లు పనిగట్టుక...