భారతదేశం, జనవరి 26 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇటీవలనే హరీశ్ రావు, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న హాజరు కావాలని ఆదేశించింది.

జనవరి 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ రావు కూడా కీలక నేతగా ఉన్నారు. మరోవైపు సిట్‌ నోటీసులపై సంతోష్‌ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని.. సిట్‌ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును సిట్ గతంలో ప్రశ్నించింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి)లో పని చేసిన డీఎస్పీతో సహా నలుగురు పోలీసు అధికారులను మార్చి 2024లో అరెస్ట్ కూడా చేశారు. వ...