Telangana,hyderabad, ఆగస్టు 8 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదన్నారు.

సిట్ లోని అధికారులు బాగున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి స్వేచ్ఛగా విచారణ జరిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ అంశాలపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్లను నియమించిందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డార...