భారతదేశం, జనవరి 20 -- హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం (జనవరి 20) నాడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులను, నేతలను విచారించిన సిట్, ఇప్పుడు హరీష్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది.

హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు....