భారతదేశం, జూలై 18 -- దేశ రాజధానిలోని ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన సాధారణ పెట్రోలింగ్ ఒక దారుణమైన నేరాన్ని వెలుగులోకి తెచ్చింది. టీనేజ్ లో ఉన్న ముగ్గురు పిల్లలు ఒక 18 ఏళ్ల వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన విషయం బయటపడింది. ఆ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని చంపేసిన తరువాత అతని మృతదేహాన్ని యమునా నది ఒడ్డున ఖననం చేశామని వారు పోలీసులకు చెప్పారు.

ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా, వారికిి నల్ల మోటారుసైకిల్ పై వస్తున్న ముగ్గురు టీనేజ్ బాలురు కనిపించారు. పోలీసులను చూడగానే వారు భయపడిపోయి, యూటర్న్ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో ఒక బాలుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ''మీ వద్ద రెండు మొబైల్ ఫ...